కాలబలిమి


చీకటిని మింగిన వెలుతురు

మిన్నూ మన్నూగానక తెగతిరుగుతుంటుంది

వెన్నెముకలా వెనకనేపొంచి ఉన్న నీడ

వాననుడిలా సమయం కోసం నిరీక్షిస్తుంటుంది.

.

వెలుతురును తొక్కిపెట్టిన చీకటి

తన విజయానికి విర్రవీగుతుంటుంది.

కాని మిణుకు మిణుకుమంటూ వెలుతురు

ఆశకు ఊపిరిపోసుకుంటూ సజీవంగా ఉంటుంది.

3 thoughts on “కాలబలిమి

  1. శ్రీ మూర్తిగారికి, నమస్కారములు.

    బహు చక్కటి భావుకత. మీ కలంలోని బలిమిని చూసాను. చీకటి, వెలుగులు అజ్నానానికి, జ్నానానికి సంకేతాలు. ఎంత వెలుగులాంటి జ్నానం వున్నా, చీకటిలాంటి అహం మనలోకి చొరబడిందంటే, అజ్నానము మనలోకి వచ్చినట్లే.

    మీ స్నేహశీలి,
    మాధవరావు.

వ్యాఖ్యానించండి