దాగుడుమూతలు
మీ కిలాంటి అనుభవాలయ్యో లేదో గాని, నాకు మాత్రం కో కొల్లలు. మొన్న, అంటే మరీ మొన్న కాదనుకొండి, ఓ నలభై ఏళ్ళకిందటిమాట, పరీక్షహాల్లో ఉన్నంతసేపూ గుర్తుకురాలేదు, x కి ఘాతంలో (-) గుర్తు వెయ్యాలని. నాకు నోటికివచ్చు ఆ లెక్కకి ఆన్సరు, కాని లెక్క చెయ్యాలికదా! ఎక్కడో తప్పు చేస్తున్నాననీ తెలుసు. విసుగెత్తి, పేపరు ఇలా ఇన్విజిలేటరు చేతిలో పెట్టేను దాని తస్సాదియ్య, ఠక్కున గుర్తుకొచ్చింది. ఏం లాభం? అలాగే నిన్న, నిన్నంటే నిన్నే లెండి, [...]

