చెప్పనిది…
Silent Farewell . నేను దాటలేకపోయినదా ఒక్క హద్దే… . ఒక క్షణిక మైన బలహీనత ఒక హృదయ దౌర్బల్యం అహంకారమా? కాదు… నీ సన్నిధిలో నాకు నా స్పృహే ఉండదు నువ్వే సరియనీ, నేనే తప్పనీ తెలిసినా, పెదవులు పెగలని సంకోచం, అంతే! . కలలలో ఎన్ని క్షమాపణలు చెప్పలేదు! కానీ నువ్వెదురుగా నిలిచినపుడు ఒక్కమాటా పెగలలేదు దానివల్ల ఫలితం మారేనా? ఏమో? మారొచ్చు… మారకపోవచ్చు. . కానీ నేను కోల్పోయాను… నీ ఆఖరి చుంబన… తుది [...]

