స్వర్గాదపి గరీయసీ రేడియో నాటిక (శ్రవ్యం 4)
రామదాసు: చిత్రాలు చూసావు గదా! నీకు వీటిలోని అంతస్సూత్రం గోచరమయిందా? రాజు: ఒక నైరూప్యభావన అయితే వచ్చింది కాని, పూర్తిగా అవగాహన అయిందని చెప్పలేను. రామదాసు: సరే! ఒక సామ్రాజ్యానికి చక్రవర్తి- అందమైన భార్య, ముద్దులుగారే కుమారుడు- అందుబాటులో సర్వ సుఖాలు- అయినప్పటికీ గౌతముడు అర్థరాత్రి ఇల్లు విడిచిపోవడానికి తగిన కారణం కనిపించిందా? రాజు: లోకంలోని దుఃఖాన్ని చూసి చలించిపోయాడని చదువుకున్నాను స్వామీ! రామదాసు: పోనీ, కులీన కుటుంబంలో పుట్టి, రెండుచేతులా ఆర్జించగల వృత్తిని వదిలి, తనవెంట [...]

